ఏప్రిల్ ఫూల్ చేద్దామనుకునేనుకుంటే పచ్చడే.. మహారాష్ట్ర పోలీసుల హెచ్చరిక

మంగళవారం, 31 మార్చి 2020 (13:35 IST)
ఏప్రిల్ నెలలో 1వ తేదీ వస్తుందంటే చాలు. చాలామంది ఎదుటివారిని సరదగా ఫూల్స్‌ చేయడానికి సిద్ధమవుతుంటారు. టెక్నాలజీ పెరగడంతో ఇది కాస్తా సోషల్ మీడియా దాకా చేరింది.

అయితే.. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఏప్రిల్ ఫూల్ పేరుతో ఎవరైనా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పుణె పోలీసులు ఈ మేరకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
 
మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొందరు ఆకతాయిలు తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

ఏప్రిల్ ఫూల్ చేద్దామని ఇలాంటి మెసేజ్‌లు పెట్టామని.. అంతకు మించి ఇంకేం లేదని ఎవరైనా కరోనాపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడేది లేదని పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు