చెన్నైకి వెళ్తున్నారా? చికెన్, మటన్ బిర్యానీలు తినకండి బాబోయ్.. క్యాట్ బిర్యానీ అమ్ముతున్నారట?!

సోమవారం, 31 అక్టోబరు 2016 (12:56 IST)
చెన్నైకి వెళ్తున్నారా? హోటళ్లలో హ్యాపీగా చికెన్, మటన్ బిర్యానీలను లాగించేస్తున్నారా? అయితే కాస్త ఆగండి గురు.. తమిళనాడు రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో క్యాట్ బిర్యానీ అమ్ముతున్నారట.. షాక్ అయ్యారు కదూ.. అయితే చదవండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీల పేరిట పిల్లుల్ని చంపి వాటి మాంసంతో క్యాట్ బిర్యానీ చేసి వడ్డిస్తున్నారు. క్యాట్ బిర్యానీల కోసం పిల్లుల్ని ఓ బోనులో బంధించి ఉంచుతారు. ఈ అక్రమ బాగోతం చెన్నైలోని పల్లావరంలో వెలుగుచూసింది. 
 
జంతు సంరక్షణకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ వాలంటీర్లు, చెన్నై పోలీసులు సంయుక్తంగా ఈ అక్రమాన్ని బట్టబయలు చేశారు. పిల్లులను బోను నుంచి విడిపించారు. అయితే పిల్లుల ప్రవర్తనను చూసి వారంతా షాక్ అయ్యారు. ఆ పిల్లులకు.. సాధారణ పిల్లుల ప్రవర్తనకు సంబంధం లేదు. గోడపై బల్లి పాకినట్లు ఎక్కుతున్నాయి. దూకుతున్నాయి. ఇందుకు కారణం బోనులోనే అవి కొన్ని నెలలుగా బంధించబడటమేనని వాలంటీర్లు అంటున్నారు. 
 
పెంపుడు పిల్లులు కనిపించట్లేదని గత కొద్దిరోజులుగా ఫిర్యాదులు అందడం ద్వారా.. విచారణ చేపట్టామని.. చెన్నైలో క్యాట్ బిర్యానీ అమ్మడం కొత్తేమీ కాదని.. గతంలో కూడా పలు హోటళ్లలో ఇలాంటి బాగోతాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి