భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో సంబంధం ఉన్న వారిని ముట్టుకోవడానికి కూడా తమ కార్యకర్తలు ఇబ్బంది పడతారని అన్నారు.
బీజేపీని హింసాత్మక, హంతకపార్టీగా అభివర్ణించిన మమత.. తృణమూల్ కాంగ్రెస్ గూండాల పార్టీ కాదన్నారు. తన కాళీఘాట్ నివాసానికి సమీపంలో పార్టీ కార్యకర్త మృతదేహంతో బీజేపీ గురువారం ఆందోళనకు దిగడంపై మమత మండిపడ్డారు.