భార్య ఫోటోలు, వీడియోలను సోదరుడికి పంపాడు.. ఎందుకో తెలుసా?

శుక్రవారం, 21 మే 2021 (17:49 IST)
వరకట్నం కేసు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. ఈ క్రమంలోనే తన అభ్యంతరకరమైన ఫొటోలను, వీడియోలను సోదరుడికి పంపించాడని ఆరోపించింది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నాలుగేళ్ల క్రితం బాధిత మహిళకు గ్వాలియర్ ప్రాంతానికి చెందిన నిందితుడితో వివాహం జరిగింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే నిందితుడు ఆమెను కట్నం కోసం వేధింపులకు గురిచేశాడు. రెండేళ్ల పాటు నిందితుడు వేధింపులను అతని భార్య భరించింది. 
 
రెండేళ్లు గడిచినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో.. పోలీసులను ఆశ్రయించింది. కట్నం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం భర్త ఇంటిని వదిలి.. తల్లిదండ్రులతో కలిసి భోపాల్‌లో నివాసం ఉండసాగింది. ఇక, తనపై నమోదు చేసిన వరకట్నం కేసును ఉపసంహరించుకోవాలని ఆ మహిళను ఆమె భర్త బలవంతం చేశాడు. ఆమెను బెదిరింపులకు గురిచేశాడు.
 
ఈ క్రమంలోనే మహిళ అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలను ఆమె సోదరుడికి పంపించాడు. వాటిని అందరికి షేర్ చేసి బహిరంగ పరుస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
 
ఈ క్రమంలోనే భర్తపై ఆమె మరోసారి పోలీసులకు ఆశ్రయించింది. భోపాల్‌లోని కోలార్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త నీతిమాలిన చర్యపై మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు