పోలీసులకు చుక్కలు చూపించిన కరోనా రోగి.. భార్యను చూడలేక..?

శనివారం, 1 మే 2021 (17:13 IST)
దేశంలో కరోనా పెరిగిపోతోంది. కరోనా సోకిన కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో వైరస్ మరింత వ్యాప్తి చెందేందుకు కారణం అవుతున్నారు. హోమ్​ క్వారెంటైన్​లో ఉండాల్సిన వారు బయట తిరుగుతూ ఇతరులకు కరోనా అంటిస్తున్నారు. 
 
తాజాగా ఓ వ్యక్తి క్వారంటైన్​ నుంచి పారిపోయి మెడికల్​ సిబ్బంది, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. 
 
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షాబుల్లా ఖాన్ అనే వ్యక్తి ముంబైలోని బాంద్రా, బోరివాలి మధ్య ఉన్న అనేక దుకాణాల్లో చొరబడి విలువైన వస్తువులను దొంగతనం చేశాడు. దీంతో పోలీసులు అతడ్ని పట్టుకొని అరెస్ట్​ చేశారు. నిందితుడికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్​గా నిర్ణారణ అయ్యింది. 
 
దీంతో సదరు నిందితుడ్ని బోరివాలి (వెస్ట్) లోని సాయి నగర్​లో గల క్వారంటైన్​ సెంటర్​కు తరలించారు. అయితే కొద్ది సేపటికే మెడికల్​ సిబ్బంది కళ్లుగప్పి క్వారంటైన్​ సెంటర్​ నుంచి తప్పించుకున్నాడు నిందితుడు. సిబ్భంది ద్వారా ఈ విషయం తెలుసుకున్న కండివాలీ స్టేషన్​ పోలీసులు రంగంలోకి దిగి 24 గంటల్లో అతడ్ని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. క్వారంటైన్​ కేంద్రం నుండి ఎందుకు పారిపోయావని పోలీసులు ప్రశ్నించగా.. తన భార్యను చూడక చాలా రోజులైందని.. ఆమెను కలవాలనుకొని పారిపోయాని సమాధానమిచ్చాడు. అతడు చెప్పిన సమాధానం విని ఖంగుతిన్నారు పోలీసులు.
 
కరోనా పాజిటివ్​ రావడంతో క్వారంటైన్​ సెంటర్​కు నిందితుడ్ని తరలించిన సందర్భంలో 'నేను ఇక్కడి నుంచి రెండు రోజుల్లో తప్పించుకుంటా' అంటూ పోలీసులకు సవాలు విసిరాడు. చెప్పినట్లుగానే క్వారంటైన్​ సెంటర్​ నుంచి పారిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడు నివసించే ఓషివారా ప్రాంతంలో గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. 
 
నిందితుడు ఓ ఫార్మసీ నుండి రెమ్‌డెసివిర్‌ను దొంగిలించాడన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. మరోవైపు ముంబైలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నగరంలో కొత్తగా 4,192 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 82 మంది ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు