బందూప్ ఏరియాలో అవినాష్ అశోక్ థొరానే (31) అనే వ్యక్తి తన భార్య, తమ్ముడు అశ్విన్ అశోక్ థొరానే (24)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి సెవ్రీలోని ఓ కన్‌స్ట్రక్సన్ కంపెనీలో పనిచేసే సివిల్ ఇంజినీర్ అవినాష్ (24) స్నేహితుడు. అవినాష్ ద్వారా ఘట్కోపర్‌లోని కన్‌స్ట్రక్సన్ కంపెనీలో పనిచేసే సివిల్ ఇంజినీర్ సూరజ్ పతాయిత్ (24) పరిచయమయ్యాడు. ఈ పరిచయంతో ఇంటికి వెళ్తూ రావడం ప్రారంభించాడు.
ఆ సందర్భంలో అవినాష్ భార్యతో సూరజ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది తెలుసుకున్న అవినాష్ థొరానే, తన తమ్ముడు అశ్విన్, స్నేహితుడు అవినాష్‌తో కలిసి సూరజ్‌ను హత్య చేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నదమ్ములైన అవినాష్ థొరానే, అశ్విన్ థొరానేలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు, సివిల్ ఇంజినీర్ అవినాష్ కోసం గాలిస్తున్నారు.