ఇంటికి రమ్మని భార్యను పిలిచాడు. అయితే తాగుడును మానితేనే ఇంటికి వస్తానని కవిత తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన హర్కేష్ తుపాకీతో ఆమెను షూట్ చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన కవిత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో వున్న హర్కేష్‌తో పాటు అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.