అమిత్ జనవరి 6వ తేదీన జన్మదినం సందర్భంగా కూడా సల్ఫాస్ విషపు మాత్రలు కలిపిన కేక్‌ను బలవంతంగా యువతికి తినిపించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. కత్తిపోట్లతో తీవ్ర గాయాల పాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు అమిత్‌ను అరెస్టు చేసి ఆయనపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.