మాదక ద్రవ్యాలకు బానిసైపోయాడు.. ప్రశ్నించిన తల్లిని కాంపస్‌తో పొడిచేశాడు..

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (16:54 IST)
మాదక ద్రవ్యాలకు బానిస అయిపోయిన కన్నకొడుకును తన మాటలతో సరిదిద్దాలనుకున్న పాపానికి.. ఆమెకు కొడుకు చేతిలో కాంపస్ పోట్లు తప్పలేదు. తిరువనంతపురం సచివాలయం దక్షిణ ద్వారం వద్ద ఓ టీనేజర్ తన తల్లిని కంపాస్‌తో పొడిచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురం సచివాలయంకు సమీపంలో తల్లీకొడుకులు ఫుట్‌పాత్‌పై నడుస్తూ వెళ్తున్న సమయంలో వాదోపవాదాలకు దిగారని, ఆ తర్వాత కొడుకు తన తల్లి మెడపై కంపాస్‌తో పొడిచేశాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
 
గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు వెల్లడించారు. మహిళ పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. వారి స్టేట్‌మెంట్లను త్వరలో రికార్డు చేస్తామని తెలిపారు. నిందితుడైన బాలుడు మాదక ద్రవ్యాలకు బానిస అనే అనుమానం ఉందన్నారు. అతనిని పోలీసు కస్టడీలో ఉంచినట్లు తెలిపారు. కొడుకు చేతిలో దాడికి గురైన గీత ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుందని పోలీసులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి