దాంతో విమాన సిబ్బంది ఆ విషయంలో అతడికి సాయం చేశారు. తర్వాత అతడు బాత్రూంకు వెళ్లి.. అక్కడ ఉన్న కాల్ బెల్ కొట్టి, సాయం కావాలని సిబ్బందిని పిలిచాడు. వెంటనే సిబ్బంది అక్కడకు వెళ్లి చూడగా.. అతడు దుస్తులన్నీ విప్పేసి అభ్యంతరకర పరిస్థితిలో కనిపించాడు.
దాంతో విమాన కెప్టెన్‌కు సిబ్బంది ఈ విషయం వెల్లడించగా, కెప్టెన్ వెంటనే ఢిల్లీలోని భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. సదరు ప్రయాణికుడు కిందకు దిగగానే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడిపై ఢిల్లీలోని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.