ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్‌ను ఆహారంగా తీసుకుంటున్న వ్యక్తి కథ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన ముసాఫ్ నగర్‌కు చెందిన నరేష్ కుమార్ (42). ఇతడు ఆ ప్రాంత వాసులచే ఎలక్టిక్ మ్యాన్ అంటూ పిలువబడుతున్నాడు. పలు సంవత్సరాలుగా నరేష్ విద్యుత్‌ను ఆహారంగా తీసుకుంటున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఒకసారి అతనికి కరెంట్ షాక్ కొట్టిందని.. అప్పుడు అతనికి ఏమీ కాలేదు.
అప్పుడే అతని శరీరంలో ఏదో శక్తి వున్నట్లు నరేష్ గ్రహించాడు. అప్పటి నుంచి ఆకలేస్తే ఆహారం తీసుకోకుండా.. కరెంటును తన శరీరంలోకి 30 నిమిషాల పాటు చొప్పించుకుంటాడు. దీంతో ఆయన ఆకలి తీరిపోతుంది. కొన్ని సమయల్లో బల్బులను వెలిగించి.. దాని వైర్లను నోట్లు పెట్టేసుకుంటున్నాడు. అంతేకాకుండా టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు సరఫరా అయ్యే విద్యుత్తును కూడా ఆహారంగా తీసుకుంటాడు.