విలేఖరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్లు : ఏపీ ప్రభుత్వ విప్ కాపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విలేకరులను ఉద్దేశించి ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విలేఖరులను వ్యభిచార గృహాల్లోని బ్రోకర్లతో పోల్చారు. ముఖ్యంగా, కొన్ని చానళ్ళలో పని చేసే విలేఖరులు వ్యభిచార గృహాల్లో పని చేసే బ్రోకర్ల కంటే హీనంగా ఉన్నారని ఆరోపించారు. అలాంటి వారంతా ఆ వృత్తి నుంచి బయటకు వచ్చి కొబ్బరి బోండాలు అమ్ముకుంటే మంచిందని హితవు పలికారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే అయిన ఈయన గారు.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ విప్‌గానూ వ్యవహరిస్తున్నారు. రాయదుర్గంలో మాట్లాడుతూ విలేకరులపై మండిపడ్డారు.