మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు.. తొలి విడత పోలింగ్ ప్రారంభం

సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (12:42 IST)
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, తొలి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో 15 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నారు.
 
మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా తొలి విడత పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 
 
నిజానికి ఆదివార‌మే యూపీ ఐదో ద‌శ ఎన్నిక‌ల‌తో పాటు మ‌ణిపూర్‌లో తొలి ద‌శ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే పోలింగ్ ఏర్పాట్ల‌లో జ‌రిగిన అంత‌రాయం కార‌ణంగా ఈ ఎన్నికలు ఈరోజుకి వాయిదా పడింది. 
 
మ‌ణిపూర్‌లో రెండో విడత పోలింగ్ మార్చి 5వ తేదీన జరగనుంది. రెండో విడతలో మిగిలిన 22 స్థానాలకు పోలింగ్‌ను నిర్వహిస్తారు. ఇక‌పోతే మార్చి 10వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు