రాఫెల్‌ డీల్‌పై మనోహర్ పారీకర్ అలా అన్నారు : రాహుల్

బుధవారం, 30 జనవరి 2019 (14:58 IST)
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. ఈ ఒప్పందంలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందని ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అనిల్ అంబానీకి మేలు చేకూర్చేలా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఒప్పందం ఖరారు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. 
 
గతంలో దేశ రక్షణ మంత్రిగా పనిచేసి ఇపుడు గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారీకర్‌తో రాహుల్ గాంధీ మంగళవారం సమావేశమయ్యారు. వాస్తవానికి పారికర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తన వ్యక్తిగత పర్యటన కోసం గోవా వెళ్లిన రాహుల్.. పారీకర్‌ను గోవా విధాన సభలో కలుసుకుని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. 
 
ఈ సందర్భంగా వారిద్దరి రాఫెల్ డీల్ చర్చ జరిగినట్టు సమాచారం. ఈ విషయంపై మీడియా రాహుల్‌ను ప్రశ్నించగా, ఇది పూర్తిగా వ్యక్తిగతమని చెప్పారు. కానీ, బుధవారం మాత్రం రాహుల్ మరోలా వ్యాఖ్యానించారు. మిత్రుడు అనిల్ అంబానీకి మేలు చేసేందుకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కుదుర్చుకున్న ఒప్పందంపై మాట్లాడేదేముందని పారికర్ అన్నారని రాహుల్ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు