దేశరాజకీయాలను ఓ కుదుపు కుదిపిన స్కామ్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు. ఈ విమానాల కొనుగోలులో వేల కోట్ల రూపాయల మేరకు అవినీతి చోటుచేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిని అస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, రాఫెల్ డీల్‌కు సంబంధించిన సీక్రెట్స్ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ వద్ద ఉన్నాయంటూ గతంలో రాహుల్ ఆరోపించారు.
కాగా, మనోహర్ పారికర్ పాంక్రియాస్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం తెల్సిందే. మరోవైపు, రాఫెల్ డీల్‌కు సంబంధించిన ఫైళ్లు పారికర్ వద్ద ఉన్నాయంటూ రాహుల్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారానికి సంబంధించి బాంబులాంటి ఫైళ్లు పారికర్ దగ్గర ఉన్నాయని చెప్పారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సైతం పారికర్ పేరును ప్రస్తావించి సభలో రాహుల్ కలకలం రేపారు.