బేరసారాలలో తమవాదనను నెగ్గేలా చేసుకునేందుకు ఇరు పార్టీలు.. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టేపనిలో నిమగ్నమయ్యాయి. మహారాష్ట్ర సీఎం పదవి సహా.. అధికారాన్ని సగం సగం పంచుకునే విషయంలో శివసేన, భాజపా మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన ఆసక్తికరంగా సాగుతోంది.
భేటీలో తమ వాదన నెగ్గేలా చేసుకునేందుకు ఇరుపార్టీలు సంఖ్యాబలం పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. ముగ్గురు స్వతంత్రులు సహా ఇద్దరు చిన్న పార్టీలకు చెందిన శాసనసభ్యులు భాజపా-శివసేన కూటమికి మద్దతు ప్రకటించారు. భాజపాకు రెబల్స్ మద్దతు స్వతంత్ర ఎమ్మెల్యేలు గీతాజైన్, రాజేంద్ర రౌత్, రవి రానా భాజపాకు జైకొట్టారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో చర్చలు జరిపిన అనంతరం గీతాజైన్, రాజేంద్ర రౌత్ భాజపాకు మద్దతు ప్రకటించగా..రవిరానా మద్దతు తెలుపుతూ లేఖ రాశారు. ఈ ముగ్గురు భాజపా రెబల్ అభ్యర్థులుగా పోటీచేసి విజయం సాధించారు.
అటు ప్రహార్ జనశక్తి పార్టీకి చెందిన అచలాపుర్ ఎమ్మెల్యే బచ్చౌ కదూ, రాజ్‌కుమార్ పటేల్ శివసేనకు మద్దతు ప్రకటించారు. పీఠం సగం సగానికి అంగీకరించకపోవచ్చు.. భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామ్‌దాస్ అథవాలే సూచించారు.