పైగా, ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్లు డాలర్లుగా ఉందనీ, ఇలాంటి ఘనత ఉంటేనే 12 శాతం వృద్ధిరేటు సాధ్యమన్నారు. అయితే, ఇలాంటి లెక్కలను వేసుకుని కూర్చొనివుంటే ఐన్‌స్టీన్ భూమ్యాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టేవాడు కాదంటూ వ్యాఖ్యానించి అభాసుపాలయ్యారు.
ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైనశైలిలో రెచ్చిపోతున్నారు. కేంద్ర మంత్రులకు ఎకనామిక్స్ (ఆర్థిక శాస్త్రం) తెలియదనీ, కనీసం జనరల్ నాలెడ్జ్ కూడా లేదంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి వారు కేంద్ర మంత్రులుగా ఉండటం మన తలరాత అంటూ సెటైర్లు వేస్తున్నారు.