ముఖ్యంగా, శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను భువనగిరి, జనగామ, ఆలేరు రైల్వేస్టేషన్‌లలో ఆపాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజు 30 వేలకు పైగా జనాభా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులకు, రోజువారి కూలీలు అనునిత్యం వళ్లి వస్తుంటారు. వీరంతా సరైన రైలు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.