ఓ హెల్త్ కేర్ కంపెనీ ఎండీగా బ్రిసీ జాన్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈ కంపెనీ సీఈవోగా వ్యాపార భాగస్వామి అయిన ఓ మహిళ పని చేస్తోంది. ఈ నేపథ్యంలో గత నెల 21వ తేదీన బ్రిసీ జాన్ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. తన పుట్టిన రోజు కానుకగా ఒక రోజంతా తనతో గడపాలని, కంపెనీ కార్యాలయంతోపాటు లిఫ్టులోనూ ఎండీ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు బర్త్ డే గిప్ట్ కింద తనకు రోజంతా సెక్స్ చేసేందుకు అనుమతించాలని కోరినట్లు బాధిత మహిళా సీఈవో బొమ్మనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన పోలీసులకు బాధిత మహిళ, జాన్ మంచి స్నేహితులని, వారు వ్యాపార పర్యటనల కోసం చెన్నై, త్రివేండ్రమ్ నగరాలకు సైతం వెళ్లి ఒకే హోటల్లో ఉన్నారని తేలింది. బాధిత మహిళకు భర్తతో వివాదం ఉండటంతో ఆమె జాన్‌తో కలిసి కంపెనీ పెట్టారని సమాచారం. అయినప్పటికీ మహిళ చేసిన ఫిర్యాదుపై పోలీసులు సెక్షన్ 354 (ఎ), 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడైన జాన్‌ను అరెస్టు చేశారు.