మైనర్ బాలికపై అత్యాచారం.. ఇద్దరు వ్యక్తులు కలిసి..?

గురువారం, 25 మార్చి 2021 (09:16 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మైనర్ బాలికపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ముజఫ్ఫార్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బోచహా అనే ఏరియాలో ఓ బాలికను గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. కాగా దీనికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ జయంత్ కాంత్ తెలిపారు. ఇద్దరు కలసి అత్యాచారం చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. 
 
నిందితులను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి.. నిందితుడు పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. గంటల తరబడి బాలిక కనిపించకపోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆమెను వెతకడం ప్రారంభించారు. వారు వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆ బాలిక అపస్మారక స్థితిలో వుండటం గమనించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు