చట్టాలు చేసేవారే పొగ ఊదేస్తే... పార్లమెంటు ముందు చూడండి ఈ ఎంపీ పొగరాయుడు...

గురువారం, 24 నవంబరు 2016 (17:03 IST)
న్యూఢిల్లీ: బ‌హిరంగ ప్ర‌దేశాల్లో పొగ‌తాగ‌రాదు అని రూల్ ఉంది. దీనిని అతిక్ర‌మిస్తే నేర‌మ‌ని తెలుసు. కానీ, చ‌ట్టాలు చేసేవారే వాటిని అతిక్ర‌మిస్తే... పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ఇదే జ‌రిగింది. ఎంపీ సౌగ‌త రాయ్ పార్ల‌మెంటు బ్రేక్‌లో బ‌య‌ట‌కు వ‌చ్చి... ఇలా ద‌మ్ము లాగేశారు. 
 
ఆయ‌న ఒదులుతున్న పొగ‌ను చూసి, ఎన్.సి.పి. ఎంపీ, సుప్రియ సూలే... చూశారా... ఇదేం పొగ బాబూ... రైలింజ‌న్లా  వ‌దులుతున్నావ్... అన్న‌ట్లు ఎలా ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చిందో. అంతేమ‌రి చ‌ట్టాలు చేసేవాళ్లే... ఇలా బ‌హిరంగంగా చుట్ట‌లు తాగితే. చెప్పేటందుకే నీతులున్నాయ్!

వెబ్దునియా పై చదవండి