నెట్‌లో డెంటల్ కాలేజీ అమ్మాయిల అశ్లీల వీడియోలు.. పెట్టింది ఎవరో తెలుసా?

గురువారం, 4 మే 2017 (09:29 IST)
టెక్నాలజీ మంచి పనులకు ఏమాత్రం ఉపయోగపడుతుందనే విషయాన్ని పక్కనబెడితే.. టెక్నాలజీ వలలో అమ్మాయిలు చిక్కుకునే నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా డెంటల్ కళాశాల అమ్మాయిల అశ్లీల వీడియోలను వెబ్‌సైట్‌లో పెట్టిన ఓ యువకుడికి ముంబయి క్రైం బ్రాంచ్ సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. నాందేడ్ నగరానికి చెందిన 26 ఏళ్ల విజయ్ గులాబ్ సింగ్ రాథోడ్ అనే యువకుడు మెడికల్ కళాశాల హాస్టల్‌లో నివాసముంటున్నాడు. ఇతడు గత నెల 21వ తేదీన డెంటల్ కళాశాల అమ్మాయిల అశ్లీల వీడియోలను కామంట్లతో పాటు ఓ వెబ్ సైట్లో పెట్టేశాడు. ఆ వీడియోలు కాస్త వైరల్ కావడంతో.. ఓ డెంటల్ డాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 
 
దర్యాప్తు జరిపిన నాగపద పోలీసులు ముంబయిలోని సైబర్ సెల్ విభాగం ద్వారా ఐపీ అడ్రస్ అనుగుణంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. అమ్మాయిల వీడియోలో పెట్టిన డెంటల్ కళాశాలలో విజయ్ గతంలో చదువుకున్నాడని.. ప్రస్తుతం మానేశాడని తెలిసింది. 

వెబ్దునియా పై చదవండి