అలా వేధించాడు.... రమ్మని పిలిచి దాన్ని తెగ నరికేసింది...

బుధవారం, 26 డిశెంబరు 2018 (18:48 IST)
లైంగిక వేధింపులకు పాల్పడుతున్నవారిపై చట్టం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు కామాంధులు మాత్రం మహిళ ఒంటరిగా కనబడితే చాలు వేధిస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఓ యువకుడు ఓ మహిళను అసభ్యంగా తన వ్యక్తిగత భాగంతో తాకిస్తూ లైంగిక వేధింపులకు గురి చేయడంతో సదరు మహిళ అతడిని వల వేసి రప్పించి అతడి మర్మాంగాన్ని తెగ నరికింది. 
 
వివరాల్లోకి వెళితే... ముంబైలోని డోంబివిలీలో 27 ఏళ్ల తుషార్ పుజారా ఓ మహిళపై కన్నేశాడు. దాంతో రోజూ ఆమెను శారీరకంగా వేధిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. ఈ వేధింపులను భరించలేని మహిళ ఎలాగైనా అతడికి బుద్ధి చెప్పాలనుకుంది. ఓ రోజు అతడు రాగానే ఫలానా చోటుకి వస్తే కోర్కె తీర్చుతానని చెప్పింది. 
 
ఇంకేముంది... ఆ కామాంధుడు వెనుకాముందూ చూసుకోకుండా ఆమె చెప్పిన చోటికి వెళ్లాడు. అతడలా రాగానే అప్పటికే ప్రణాళిక ప్రకారం ఇద్దరు దృఢకాయులు మాటు వేసి చటుక్కున అతడిని పట్టేశారు. వెంటనే ఆ మహిళ కోపంతో ఊగిపోతూ... లైంగిక వేధింపులకు పాల్పడతావా అంటూ అతడి మర్మాంగాన్ని పదునైన కత్తితో తెగ నరికేసింది. ఆ తర్వాత వారంతా అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు సమాచారం అందించడంతో బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు