ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబై, మాన్‌ఖర్థలో నివసిస్తున్న ఓ బాలికకు ఆమె కుటుంబ సభ్యులు యేడాది క్రితం బాల్య వివాహం జరిపించి అమానవీయ ఘటన పాల్పడ్డారు. తనకు పెళ్లి ఇష్టం లేదన్నా వినకుండా 15 ఏళ్ల బాలికను 35 ఏళ్ల వయసు గల వ్యక్తికిచ్చి బలవంతంగా వివాహం జరిపించారు.
అయితే, ఆ బాలిక అతనితో ఉండేందుకు నిరాకరించి, తిరిగి పుట్టింటింటికి చేరింది. అయితే, ఆమెను చేరదీయాల్సిన తల్లిదండ్రులు చిత్ర హింసలకు గురిచేశారు. కుటుంబ పోషణ కొరకు వ్యభిచారం చేయల్సిందిగా తల్లిదండ్రులు, ఆమె సోదరుడు ఒత్తిడి చేశారు. వారి వేధింపులను బరించలేని బాలిక సమీపంలోని పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యులు, భర్త, సోదరుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, వ్యభిచారం చేయాలంటూ బలవంతపెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు... బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లిదండ్రులు, సోదరుడు, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. అయితే బాలిక సొంత సోదరుడు కూడా తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వారిపై పోక్స్, మైనర్ బాలికల వివాహ నిషేదిత చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు.