ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాలువలోని బస్సును గుర్తించి క్రేన్ల సాయంతో బయటకు తీశారు. 32 మృతదేహాలను సిబ్బంది వెలికితీయగా, మరో రెండు నీటిలో కొట్టుకుపోయాయి. ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఘటనా స్థలాన్ని సీఎం మమతా బెనర్జీ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల నష్టపరిహారాన్ని ఆమె ప్రకటించారు.