12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ఆపై నిప్పెట్టి చంపేశారు..

శుక్రవారం, 15 జనవరి 2021 (14:47 IST)
బీహార్‌లో 12 ఏళ్ల బాలికపై ఘోరం జరిగింది. కామాంధులు రెచ్చిపోయి.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంకా ఆమెను నిప్పెట్టి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రం, ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన కూలీ కార్మికుడికి ఇద్దరు కుమార్తెలున్నారు. జనవరి 3వ తేదీ ఈ కూలీ కార్మికుడు ఇంట్లో లేని సమయంలో నలుగురు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి.. 12 ఏళ్ల కూలీ కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై అదే గదికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
తన కుమార్తెపై జనవరి 3 తేదీనే కాకుండా.. డిసెంబర్ 23వ తేదీనే అత్యాచారం జరిగిందని.. ఈ తతంగాన్ని వీడియో తీసి.. ఆ వీడియోతో బెదిరింపులకు గురిచేసారని.. పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తండ్రి రోదిస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో వున్న నలుగురి కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు