హెచ్‌ఆర్‌హెచ్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ గ్లోబల్‌ సస్టెయినబల్‌ రికవరీ ప్లాన్‌ టెర్రా కార్టాకు దాల్మియా మద్దతు

బుధవారం, 13 జనవరి 2021 (23:41 IST)
ప్రకృతి, ప్రజలు, ప్లానెట్‌పై దృష్టిసారించడం ద్వారా భవిష్యత్‌ ఆర్థిక వ్యవస్ధ మరియు పరిశ్రమ యొక్క భవిష్యత్‌ను నిర్మించడంలో పాల్గొనాలనే ప్రయత్నంలో భారతీయ సిమెంట్‌ అగ్రగామి మరియు దాల్మియా భారత్‌ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ అయిన దాల్మియా సిమెంట్‌ (భారత్‌) లిమిటెడ్‌ ఇప్పుడు హిజ్‌ రాయల్‌ హైనెస్‌ ప్రిన్స్‌ చార్లెస్‌ నూతనంగా ఆవిష్కరించిన గ్రీన్‌ కార్యక్రమం టెర్రా కార్టాకు మద్దతునందించనున్నట్లు వెల్లడించింది. 2030 నాటికి ప్రతిష్టాత్మక మరియు సుస్ధిరమైన భవిష్యత్‌ వైపు వెళ్లడానికి రోడ్‌మ్యాప్‌ టెర్రా కార్టా. ప్రకృతి యొక్క శక్తితో  ప్రైవేట్‌ రంగం యొక్క రూపాంతర శక్తి, ఆవిష్కరణ మరియు వనరులను మిళితం చేసి టెర్రా కార్టా వినియోగించుకుంటుంది.
 
దాదాపుగా ప్రతి రంగంలోనూ అంతర్జాతీయంగా అగ్రగామి వ్యాపార నాయకుల భాగస్వామ్యంతో అందించిన సూచనల ఆధారంగా టెర్రా కార్టా రూపుదిద్దబడింది. వీటితో పాటుగా, అంతర్జాతీయంగా వాతావరణ మరియు జీవవైవిధ్య సంక్షోభాలకు తగిన పరిష్కారాలను అందించే అసలైన భవిష్యత్‌ నిర్మించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకం, కానీ ఆచరణాత్మక చర్య అభివృద్ధి చేయబడింది.
 
ఈ టెర్రా కార్టా పది ప్రాంతాలలో చర్యలను తీసుకోవాల్సిందిగా సూచిస్తుంది మరియు 100కు పైగా చర్యలను వ్యాపారాలలో సుస్ధిరమైన భవిష్యత్‌ను నిర్మించేందుకు కలిగి ఉంటుంది. సస్టెయినబల్‌ మార్కెట్‌ ఇనీషియేటివ్‌ (ఎస్‌ఎంఐ) కోసం మార్గదర్శక విధిగా ఇది సేవలను అందిస్తుంది. ఇది రాబోయే పదేళ్లలో పురోగతిని ప్రోత్సహిస్తూనే, దానిని ప్రదర్శిస్తూ వేడుక చేసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా  వేగవంతంగా సాధించే మార్పులు మరియు నిరంతర పురోగతిని ప్రతిబింబించేలా ఇది ఎస్‌ఎంఐ చేత ప్రతి సంవత్సరం నవీకరించబడుతుంది.
 
ఈ కార్యక్రమంలో భాగం కావడం పట్ల శ్రీ మహేంద్ర సింఘి, ఎండీ అండ్‌ సీఈవో, దాల్మియా సిమెంట్‌ (భారత్‌) లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘సస్టెయినబల్‌ మార్కెట్స్‌ ఇనీషియేటివ్‌ (ఎస్‌ఎంఐ) తరహాలోనే ఒకే విధమైన విధానంతో మేము కూడా వెళ్తుండటంతో పాటుగా టెర్రా కార్టాతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా గర్వంగా ఉన్నాము. మేము ఎప్పుడూ స్థిరమైన అభివృద్ధికి కృషి చేయడంతో పాటుగా దానిని అభ్యసిస్తున్నాము.
 
ఇది దాల్మియా జీవన విధానంలో ఓ భాగం. అతి తక్కువ కార్బన్‌ పరివర్తన కోసం వ్యాపార సంసిద్ధత కలిగిన కంపెనీగా అంతర్జాతీయంగా నెంబర్‌ 1 ర్యాంక్‌తో సీడీపీ గుర్తించింది. మా అపార నైపుణ్యం మరియు మనస్సాక్షి ఎంపికలు, అంతర్జాతీయ ప్రమాణాలు మరియు సస్టెయినబల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌తో మా లక్ష్యం ఏకీకృతం చేయడానికి దోహడపడ్డాయి మరియు 2040 నాటికి కార్బన్‌ నెగిటివ్‌ సిమెంట్‌ గ్రూప్‌గా మమ్మల్ని మేము మార్చుకోవడానికి సైతం ఇది తోడ్పడుతుంది’’ అని అన్నారు.
 
‘‘భవిష్యత్‌ పరిశ్రమ మరియు ఆర్థిక వ్యవస్ధలు భవిష్యత్‌ ప్రకృతి, ప్రజలు మరియు ప్లానెట్‌ భవిష్యత్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత కోవిడ్‌–19 మహమ్మారి స్పష్టంగా ఆర్ధిక వ్యవస్ధ మరియు పరిశ్రమ వంటివి ప్రకృతి ప్రసాదించిన పర్యావరణ వ్యవస్ధ సేవలతో అంతర్గతంగా బంధం ఏర్పరుచుకున్నవి. దాల్మియా భారత్‌ వద్ద, మనం వారసత్వంగా పొందిన దాని కన్నా మెరుగైన గ్రహాన్ని  మన భావితరం కోసం వదిలివెళ్లడానికి మనం ఋణపడి ఉన్నామని నమ్ముతున్నాము. ఇది కార్బన్‌ నెగిటివ్‌ మరియు ప్రకృతి సానుకూల భవిష్యత్‌ను పునః రూపకల్పన చేయడానికి మాకు సహాయపడుతుంది’’ అని శ్రీ సింఘి జోడించారు.
 
ఓ కంపెనీగా,దాల్మియా సిమెంట్‌ (భారత్‌) లిమిటెడ్‌ ఎల్లప్పుడూ పర్యావరణానికి కట్టుబడి ఉండటంతో పాటుగా సస్టెయినబల్‌ ప్రాక్టీసెస్‌పై స్ధిరంగా దృష్టి సారిస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా, డీసీబీఎల్‌ ఓ శక్తివంతమైన మరియు వైవిధ్యమైన బ్రాండ్‌గా మారడంతో పాటుగా పర్యావరణ పరంగా బాధ్యతాయుతమైన వ్యాపార గ్రూప్‌గా నిలిచింది. ఇది క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ అనేది లాభదాయకమైన మరియు  సుస్థిరమైనది అనే వ్యాపార సిద్ధాంతం అనుసరిస్తుంది. తద్వారా సానుకూల పర్యావరణ మరియు సామాజిక ప్రభావం సృష్టిస్తుంది.
 
ఈ గ్రూప్‌ ఐదురెట్లు వాటర్‌ పాజిటివ్‌గా నిలువడంతో పాటుగా ప్రపంచంలో ఈపీ100 మరియు ఆర్‌ఈ100లో చేరిన మొట్టమొదటి సిమెంట్‌ కంపెనీగా నిలిచింది. సంప్రదాయ ఇంధనాలు మరియు ముడి సరుకులను ప్రత్యామ్నాయ పరిష్కారాలతో భర్తీ చేయడం ద్వారా డీసీబీఎల్‌ స్ధిరంగా తమ పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తుంది. దీనియొక్క సమ్మిళిత సిమెంట్‌ పోర్ట్‌ఫోలియో మరియు లో కార్బన్‌ సాంకేతికతలో నిరంతర పెట్టుబడులు వంటివి భూగ్రహంపై ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు