వివరాలలోకి వెళ్తే... కోడిహళ్ళికి చెందిన ఉమేష్‌ని ఫిబ్రవరి 26న ఉజ్జని అటవీ ప్రాంతంలో తలపై బండరాళ్ళు వేసి అత్యంత కిరాతకంగా హత్య చేసారు కొందరు దుండగులు. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని గుర్తించిన దొడ్డబళ్ళాపుర పోలీసులు అతని భార్య గాయత్రి (23), దొడ్డబళ్ళాపురంకు చెందిన కిరణ్ కుమార్ (20)ను మైనార్టీ తీరని మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. హతుడి చొక్కా కాలర్‌పై ఉన్న టైలర్ పేరు ఆధారంగా కూపీ లాగడం ప్రారంభించారు. షర్ట్ కాలర్‌పై హెసరుగట్ట అని ఉండడంతో ఆ ఆధారాన్ని వదలకుండా కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చారు.
హతుడు ఉమేష్ (30) కనిపించడం లేదని తొలుత కేసు దాఖలు చేసిన పోలీసులు చొక్కా కాలర్ గుర్తు ఆధారంగా ఉజ్జని అటవీ ప్రాంతంలో దొరికిన గుర్తు తెలియని మృతదేహం ఉమేష్‌దేననే నిర్దారణకు వచ్చి హతుని భార్యను, ఆమె ప్రియుడిని అదుపు లోకి తీసుకొని ప్రశ్నించగా తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా ఉమేష్‌ను కిరాతకంగా హత్య చేయించినట్లు వారు అంగీకరించారు. ఇందులో స్థానిక రౌడీల సహకారం తీసుకున్నట్లు విచారణలో వెల్లడించారు. షర్ట్ కాలర్ గుర్తు తెలియని మృతదేహం ఆచూకీని చెప్పడంతో పాటు హత్య మిస్టరీని విడదీయడం ఇందులో విశేషంగా చెప్పుకోవలసి ఉంది.