అసెంబ్లీకి హాజరైన గర్భవతి... ఎక్కడ?

ఆదివారం, 1 మార్చి 2020 (10:18 IST)
మహారాష్ట్ర అసెంబ్లీకి గత యేడాది జరిగిన ఎన్నికల్లో అనేక మంది మహిళలు కూడా ఎన్నికయ్యారు. వీరిలో ఓ ఎనిమిది నెలల గర్భిణి కూడా ఉన్నారు. ఆమె పేరు నమిత ముందాడ. వయసు 30. రాష్ట్రంలోని బీడ్‌ జిల్లాలోని కెజ్‌ ఎస్సీ రిజర్వుడ్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికయ్యారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఆమె శుక్రవారం హాజరయ్యారు. తద్వారా గర్భవతిగా ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన తొలి మహిళగా రికార్డు నెలకొల్పారు. దీనిపై నమిత స్పందిస్తూ.. 'ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకావడం నా విధి.. బాధ్యత. నా నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నాయి. వాటిని సభలో నేను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది' అని వ్యాఖ్యానించారు. 
 
ఒకప్పుడు బీడ్‌ జిల్లా ఆడ శిశువుల అబార్షన్లకు పెట్టింది పేరు. కానీ ప్రస్తుతం నమిత మందాడ వంటి ధైర్యవంతురాలైన మహిళ ఈ జిల్లా నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తుండటం ఆ జిల్లాకే కాకుండా మహారాష్ట్రకు కూడా గొప్ప గర్వంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు