గుంటూరులో వైకాపా ఎమ్మెల్యే కారుపై రాళ్ళదాడి

శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (10:29 IST)
గుంటూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే విడుదల రజినీపై అర్థరాత్రి రాళ్లదాడి జరిగింది. ఈదాడిలో ఆమె కారు అద్దాలు ధ్వంసంకాగా, ఆమె మరిది గోపినాథ్‌కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. కోటప్పకొండ... కట్టుబడివారిపాలెంలో అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రజనీ మరిది గోపీనాథ్... కోటప్పకొండకు వెళ్లి ప్రభలను ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. 
 
కాగా, దుండగులు దాడి చేసిన కారులో ఎమ్మెల్యే రజనీ ఉన్నారన్న ఉద్దేశంతో దాడి చేసినట్లుగా సమాచారం. కానీ ఆ కారులో ఎమ్మెల్యే రజనీ లేరు. ఈ విషయం తెలుసుకున్న సదరు దుండగులు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న క్రమంలో ఈ విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు అక్కడకు రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సదరు దుండగులపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రెండు వర్గాల వారికీ స్వల్ప గాయాలైనట్లుగా సమాచారం. 
 
దీంతో గుంటూరులో రాజకీయం వేడెక్కటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు, రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో ఎమ్మెల్యే రజనీ మరిది గోపీనాథ్ నర్సారావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అనుచరులు కారును అడ్డుకున్న విషయం తెల్సిందే. దీంతో గోపీనాథ్ కోటప్పగుడికి వెళ్తున్నారనీ తెలిసి ఎంపీ అనుచరులు గోపీనాథ్ కారుపై దాడికి యత్నించినట్లుగా ప్రచారం జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు