'నల్ల' కుబేరులకు మోదీ మరో షాక్...? మెల్టింగ్ నోట్లు... 6 నెలల్లో మంచులా కరిగిపోతాయట...

శుక్రవారం, 23 డిశెంబరు 2016 (17:11 IST)
దేశంలో నల్ల ధనాన్ని కుప్పలు కుప్పలుగా పోగు చేసుకుని బెడ్రూం డబుల్ కాట్ మంచాల్లో, ఇంట్లో నేలమాళిగల్లో దాచేసుకుంటున్న వారి తాట తీసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారట. ఎందుకంటే నోట్ల రద్దుకు ముందు ఆర్బీఐ ప్రకటించిన కరెన్సీకి సమానంగా బ్యాంకుల్లోకి డిపాజిట్లు వచ్చేశాయి. ఆ తర్వాత మెల్లిగా వెనక్కి కూడా మళ్లిపోతున్నాయి. కనుక నల్ల కుబేరులు వివిధ మార్గాల్లో తమతమ నల్ల డబ్బును చక్కగా మార్చేసుకున్నారని అర్థమవుతుంది.
 
ఈ పరిస్థితి చూస్తే నల్లధనం దాచేసే నల్ల బాబులు తెలివితేటలు తలలో కాదు అరికాల్లో ఉందని అర్థమవుతుంది. వారు తమ తెలివితేటలతో ఇంట్లోనే కూర్చుని కొత్త నోట్లను ఇంట్లోకి దర్జాగా రప్పించుకున్న వైనాన్ని మనం చూస్తూనే ఉన్నాం. వీరి ఆటలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ ప్రకారం, రాబోయే మరికొన్ని రోజుల్లో కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసిన రూ.2000 నోట్లను రద్దు చేసేస్తారట. 
 
ఆ స్థానంలో మళ్లీ కొత్త నోట్లను ప్రవేశపెడతారట. ఐతే ఈ నోట్లు 6 నెలల్లో మంచులా కరిగిపోతాయట. అంటే... ఒకవేళ నల్ల కుబేరులు డబ్బులను కుప్పలు కుప్పలుగా ఇంట్లో పోసుకుని కూర్చునేందుకు వీల్లేదు. ఒకవేళ అలా పోసుకుని కూర్చుంటే అవి కాస్తా కరిగిపోయి ముద్దలా మారిపోతాయట. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలను నేషనల్ సైన్స్ రీసెర్చి మిషన్ ఆర్బీఐ ముందుకు తెచ్చిందట. దీన్ని ప్రస్తుతం ఆర్బీఐ క్షుణ్ణంగా పరిశీలన చేస్తోందట. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే డబ్బంతా బ్యాంకుల్లోకి వెళ్లిపోవాల్సిందే. ఇంట్లో ఉంటే కరిగి గడ్డయిపోతుందన్నమాట. చూద్దాం... ఏం జరుగుతుందో?

వెబ్దునియా పై చదవండి