భూటకపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించండి..

శనివారం, 14 ఆగస్టు 2021 (11:31 IST)
భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ విడుదల చేశారు. ఆగస్టు 15, 2021న జరిగే భూటాకపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని లేఖ ద్వారా పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలూ బహిష్కరించాలన్నారు. 
 
నిజమైన స్వాతంత్ర్యం కోసం, నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వాములు కావాలన్నారు. ఫాసిస్టు సర్కార్‌కు వ్యతిరేకంగా, ప్రజలలో పెరుగుతున్న ఆగ్రహన్ని పక్కదారి పట్టించచడం ప్రధాని మోదీ కుట్రేనన్నారు. ఆగస్టు 15 ,1947 దేశానికి స్వాతంత్య్రం రాలేదని అభయ్ పేర్కొన్నారు.
 
ఇదిలా ఉంటే.. 75వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త వెబ్ సైట్ indianidc2021.mod.gov.in . ని రివీల్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ ని డిఫెన్స్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్ ఆగస్టు 3వ తేదీన లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ వెబ్సైట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరినీ కూడా కనెక్ట్ చేస్తుంది. అయితే మొబైల్ యాప్ ని కూడా త్వరలో ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.
 
న్యూఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకలు అందరికీ చూడడానికి వీలుగా ఈ వెబ్ సైట్‌ని రూపొందించారు. అయితే వీఆర్ గ్యాడ్జెట్ లేకుండా కూడా 360 డిగ్రీ ఫార్మాట్ లో చూడొచ్చని చెబుతున్నారు. అదే విధంగా దీనిలో మరికొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు