దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతపవనాలు.. పొలం పనుల్లో రైతులు

శనివారం, 27 జూన్ 2020 (14:54 IST)
దేశమంతటా నైరుతి రుతు పవనాలు విస్తరిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతు పవనాలు ముందుగా విస్తరించడం వల్ల ఖరీఫ్ సాగు సరైన సమయంలో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఈ రుతు పవనాలు జూలై 8 నుండి విస్తరించాల్సి వుండగా ఈ ఏడాది 12 రోజులుకు ముందుగానే దేశమంతటా విస్తరించడం శుభపరిణామం. 
 
రుతుపవనాలు జూన్ 26 నాటికే దేశంలో చివరి ప్రాంతమైన రాజస్థాన్ లోని శ్రీగంగానగర్‌కు చేరుకున్నాయి. ఇదిలావుండగా 2015లోనూ జూన్ 26 నాటికే ఇలా విస్తరించాయి. ఐతే 2015 తర్వాత ఇవి అతివేగంగా దేశం చివరి భాగానికి చేరుకోవడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.
 
గడిచిన 15 సంవత్సరాలలో నైరుతి రుతుపవనాలు జూన్ 26కి ముందు విస్తరించడము 2015లో ఒక్కసారే జరిగింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు శుక్రవారము నాటికి విస్తరించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు ముందుగా రావడంతో రైతులు తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు