టెక్స‌టైల్ మంత్రి ప‌ద‌వి త‌క్కువదేమీ కాదే... మోదీకి థ్యాంక్స్: స్మృతి ఇరానీ

బుధవారం, 6 జులై 2016 (21:09 IST)
న్యూఢిల్లీ: శాఖ మార్చార‌ని మీడియా గ‌గ్గోలు పెడుతుంటే, స్మృతి ఇరానీ మాత్రం సంతృప్తిని వ్య‌క్తం చేశారు. త‌న‌కు టెక్స్‌టైల్ మంత్రి ప‌ద‌వి అప్ప‌గించినందుకు ప్ర‌ధాని మోదీకి అభినంద‌న‌లు తెలుపుతున్నాన‌ని చెప్పారు. ఢిల్లీలో స్మృతి ఇరానీ త‌న శాఖ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా కిక్కిరిసిన మీడియా స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ, వ్య‌వ‌సాయం త‌ర్వాత అంత‌టి అధిక సంఖ్య‌లో కార్మికులు ఉపాధి పొందుతున్న జౌళిశాఖ ఎంతో విలువైన‌ద‌ని చెప్పారు. 
 
ప్ర‌ధాని క‌ల‌లు కంటున్న మేకిన్ ఇండియాకు ఈ శాఖ నుంచి ఉపాధి మార్గాలు ఎంతో ముఖ్య‌మ‌న్నారు. త‌న స్థానంలో వ‌చ్చిన హెచ్ఆర్డి మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌కు ఆమె అభినంద‌న‌లు తెలిపారు. అలాగే, జౌళిశాఖకు ఇంత‌వ‌ర‌కు ప‌నిచేసిన సంతోష్ కుమార్, మ‌రో కేంద్ర మంత్రి అజ్ టంటా ఇరానీకి అభినంద‌న‌లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి