తాజాగా, హర్యానాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ ఈ సందర్భంగా మాట్లాడుతూ... కరోనా విజృంభణ సమయంలో తాను ఇంటికే పరిమితమై రెండు పనులు చేశానని అన్నారు. ఒకటి ఇంట్లో వంట చేయడం కాగా, ఇంకోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపన్యాసాలు ఇవ్వడం అని ఆయన చెప్పారు.
తాను ఆన్‌లైన్‌లో చాలా క్లాసులు తీసుకున్నానని, వాటిని యూ ట్యూబ్‌లోనూ అప్‌లోడ్ చేశాని వివరించారు. దీంతో వాటికి వ్యూస్ బాగా వచ్చాయని, యూట్యూబ్ తనకు నెలకు నాలుగు లక్షలు చెల్లిస్తోందని తెలిపారు.
తాను తన బాధ్యతల నిర్వహణలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోనని స్పష్టం చేశారు. తన పెళ్లైన కొత్తలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నారు. తనకు పిల్లనిచ్చిన మామ రోడ్డు మధ్యలో ఇంటిని కట్టుకున్నారని, ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లి అక్కడ నుంచి తన వద్దకు వచ్చిందన్నారు.