నితీష్ ఎత్తుగడలను యోగాసనాలతో పోల్చిన సుబ్రహ్మణ్య స్వామి

శనివారం, 29 జులై 2017 (16:51 IST)
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజకీ ఎత్తుగడలను బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి యోగాసానలతో పోల్చారు. గత ఎన్నికల అనంతరం ఆర్జేడీతో జట్టుకట్టి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పగ్గాలు చేపట్టిన విషయం తెల్సిందే. తాజాగా లాలూకి కటీఫ్ చెప్పి, గతంలో చెయ్యిచ్చిన బీజేపీతో పొత్తు పెట్టుకుని విశ్వాస పరీక్షలో నెగ్గిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. రాజకీయాల్లో నైతిక విలువల అంశం తెరమీదికి వచ్చింది. నితీష్ కుమార్‌పై నేరుగా ఎలాంటి విమర్శలు చేయన్నారు. నితీష్ కుమార్ రాజకీయ విన్యాసాలను యోగాసనాలతో పోల్చుతూ కార్టూన్ ఒకటి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దానిని మీరు కూడా చూడండి. 

వెబ్దునియా పై చదవండి