ఈ నేపథ్యంలో నిజో కుటుంబీకులు రాత్రి నిద్రపోయారు. మంగళారం తెల్లవారుజాము వరకు బయటకు రాలేదు. దాంతో నిజో తల్లి వారి ఇంటికి వెళ్లింది. ఎంత తలుపు తట్టినా నిజో గది తెరవలేదు. అనుమానంతో కిటికీలోంచి చూడగా బెడ్‌రూమ్‌లో నిజో, శిల్పా ఉరివేసుకుని కనిపించారు. మనవళ్లిద్దరూ మంచంపై శవమై కనిపించారు. ఇది చూసి అందరూ షాకయ్యాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. తలుపులు పగులగొట్టి లోపలికెళ్లారు నిజో, శిల్ప సహా నలుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పరవూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో నిజో భార్య శిల్ప పని నిమిత్తం ఇటలీ వెళ్లింది. అక్కడ సరైన ఉద్యోగం, జీతం రాకపోవడంతో ఇటీవల కేరళకు తిరిగొచ్చింది. దీంతో అప్పుల బాధ పెరిగింది. దీంతో నిజో, శిల్ప ఇద్దరు కుమారులకు విషమిచ్చారు.