కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక సామర్థ్యం ఉండాలి. కొందరు ఎక్కువ సంపాదించవచ్చు, కొందరు తక్కువ సంపాదించవచ్చు. అయితే, దానిని పొదుపు చేయడం, పంచుకోవడం, ఖర్చు చేయడంలో సమాన బాధ్యత ఉంది. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త సంపాదించడం, ఖర్చు చేయడం, పొదుపు చేయడం సరికాదు. ఇది సమస్యలకు దారి తీస్తుంది.
కుటుంబంలో శాంతి నెలకొనాలంటే సహనం, శరణాగతి, త్యాగం కూడా అలవర్చుకోవాలి. ఇతరుల అపరాధాలను అతిశయోక్తిగా చెప్పకుండా క్షమించడం, మరచిపోవడం శాంతికి దారి తీస్తుంది. జీవిత భాగస్వామిపై ఇతరుల ముందు కించపరచడం, ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరిస్తాయి. జన్మ సాగరాన్ని ఈదుకురావాలంటే కుటుంబ శాంతి కూడా అవసరమే.