భారత సైనికులకు మతం వుండదండోయ్: ఓవైసీకి లెఫ్టినెంట్ జనరల్ ఝలక్

శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (14:05 IST)
దేశం కోసం ముస్లింలు సైన్యంలో వుండి ప్రాణత్యాగం చేస్తున్నప్పటికీ.. తమను పాకిస్థానీయులనే ముద్ర వేస్తున్నారనంటూ ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై సైన్యం ఘాటుగా స్పందించింది. సైనికులను తాము మత కోణంలో ఎన్నడూ చూడలేదని ఆర్మీ ఉత్తర విభాగం లెఫ్టినెంట్ జనరల్ దేవరాజ్ అన్భు స్పష్టం చేశారు. 
 
మీలాంటి వాళ్లే ఆ పని చేస్తున్నారంటూ దేవరాజ్ పరోక్షంగా నిప్పులు చెరిగారు. అమరవీరులకు మతం రంగు పులిమి లబ్ధి పొందాలనుకుంటున్నారని చురకలంటించారు. భారత సైనికులకు మతం వుండదనే విషయం వారికి తెలియకపోవచ్చునని.. వారి దేశభక్తిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. 
 
కాగా సంజువాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లలో ఐదుగురు ముస్లింలు వున్నారని చెప్పిన ఓవైసీ.. దేశం పట్ల ముస్లింలకు ఉన్న ప్రేమ, చిత్తశుద్ధిని ప్రశ్నించేవారికి ఈ ఉదంతం ఒక కనువిప్పు కావాలంటూ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు