పార్టీలో వివాదాలు తాత్కాలికమని, మనమంతా ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యేలకు ఆయన పిలుపునిచ్చారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ విడిపోతుందని ప్రత్యర్థులు చూస్తున్నారని, ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందన్నారు.
అమ్మ అసంపూర్తిగా మిగిల్చిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన లేఖలో తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పనులపై దృష్టి పెట్టాలని పన్నీర్ సెల్వం సూచించారు. ఏ పార్టీ మద్దతు, సహకారం లేకుండానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు.