ఊబకాయం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య. ఊబకాయంతో బాధపడే వారి శాతం పెరగడం గత కొన్నేళ్లుగా భారతదేశానికి ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం అది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇటీవల నిర్వహించిన ఆర్థిక సర్వే ప్రకారం, భారతదేశంలో 54శాతం వ్యాధులు ఆహారం కారణంగా ఏర్పడుతున్నాయి.
అధిక రక్తపోటు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. మంచి ఆహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. వృద్ధుల్లో ఊబకాయం ఆందోళన కలిగిస్తోందని ఆర్థిక సర్వే పేర్కొంది.
సర్వే నివేదిక ప్రకారం, గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం ఎక్కువగా ఉంది. ఊబకాయం గ్రామీణ ప్రాంతాల్లో 19.3శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 29.8శాతంగా ఉంది. 18-65 సంవత్సరాల వయస్సు గల పురుషులలో ఊబకాయం రేటు 18.9శాతం నుండి 22.9శాతానికి పెరిగింది. మహిళల్లో 20.6శాతం నుంచి 24శాతానికి పెరిగింది.