చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని జైపూర్ జిల్లాకు చెందిన ఓ బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఏకంగా 28 రోజుల పాటు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికను ఆదివారం సాయంత్రం ఖరస్రోస్టా నదిలో తోసేశారు.
గత నెల ఆగస్టు 20వ తేదీన ఆ బాలిక మధుబన్ బజార్లో స్టేషనరీ ఐటమ్స్ కొనుగోలు చేసేందుకుగాను ఇంటి నుంచి బయటికి వచ్చినట్లు గ్రామస్తులకు చెప్పింది. ఆ బాలికను నిందితులు అక్కడి నుండి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంట్లో ఆ బాలికను నిర్భంధించి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది.