తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, మైనర్ బాలిక చేయి పట్టుకోవడం, ఓ ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన 50 ఏళ్ల వ్యక్తికి ట్రయల్ కోర్టు పోక్సో చట్టం సెక్షన్ 10 కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది.
అంటే.. ఆ చిన్నారి ప్యాంటు జిప్ తీయడం, చేయి పట్టుకోవడం వంటివి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (పోక్సో) కింద లైంగిక దాడి కాదని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ చెప్పింది. అది ఐపీసీ సెక్షన్ 354 కింద లైంగిక వేధింపుల కిందికి వస్తుందని స్పష్టం చేసింది.
అయితే అప్పటికే అతడు ఐదు నెలల జైలు శిక్ష అనుభవించి ఉండటంతో.. ఈ నేరానికి ఆ శిక్ష సరిపోతుందని కోర్టు తేల్చి చెప్పింది. ఈ నెల 19న కూడా ఇదే న్యాయమూర్తి.. నేరుగా శరీరాన్ని స్పృశించకుండా (స్కిన్ టు స్కిన్ టచ్) ఓ మైనర్ బాలిక స్థనాలను తాకడం పోక్సో చట్టం కింద లైంగిక దాడి కాదని తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.