తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితను కొందరు చంపేశారనీ, ఈ విషయంలో నిజనిర్ధారణ జరిపించాలంటూ అన్నాడీఎంకేకు చెందిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గీయులైన 12 మంది ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కలిసి వినతి పత్రం సమర్పించారు.
72 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన జయమ్మను చూసేందుకు ఏ ఒక్కరినీ అనుమతించలేదని వారు గుర్తుచేశారు. పైగా, అమ్మకు పెట్టిన వెంటిలేటర్‌ను సైతం తొలగించారనీ, దాన్ని ఎవరి అనుమతితో తొలగించారో తేల్చాలని వారు డిమాండ్ చేశారు.