దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్న తబ్లీగి జమాత్ కార్యకర్తలపై కేంద్రం కన్నెర్రజేసింది. ముఖ్యంగా, టూరిస్ట్ వీసాలపై వివిధ దేశాల నుంచి వచ్చిన రెండు వేల మందికిపైగా విదేశీ తబ్లీగి ప్రతినిధులను బ్లాక్‌లిస్టులో ఉంచింది. వీరంతా పదేళ్ళపాటు భారత్‌లో అడుగుపెట్టందుకు వీలులేదు.
కాగా, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా సదస్సు జరిగిన భవనంలోనే ఉండిపోవడం ప్రమాదకరంగా మారింది. మార్చి 22 జనతా కర్ఫ్యూ తర్వాత సదస్సు జరిగిన భవనం నుంచి అధికారులు వేలాది మంది తబ్లీగీలను బలవంతంగా బయటకు తీసుకువచ్చారు.