ఉత్తర చెన్నైలో ఉన్న ఆర్కే నగర్‌లో తెలుగువారు అధికంగా ఉండడం, మధుసూదన్‌కు అక్కడ పరిచయాలు అధికంగా ఉండటంతో అక్కడి నుంచి బరిలోకి దించాలని ఓపీఎస్ నిర్ణయించారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ... ఆర్‌కే నగర్‌లో తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇకపోతే.. అన్నాడీఎంకే నేతల్లో జయ ఆగ్రహానికి గురికాని ఏకైక వ్యక్తి మధుసూధన్. జయకు నమ్మినబంటు. అందుకే ఎంతమందిని ఎన్ని పదవుల నుంచి మార్చినా మధుసూదన్‌ను మాత్రం శాశ్వతంగా ప్రిసీడియం చైర్మన్ పదవిలోనే జయ ఉంచారు. అయితే ఆమె మరణానంతరం ఓపీఎస్ బృందంతో జతకట్టిన మధుసూదన్... శశికళపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే.