‘అమ్మ’ మృతిపై న్యాయ విచారణ జరపకపోతే ఈనెల 8న తన మద్దతుదారులు, పార్టీ నేతలతో కలిసి నిరాహార దీక్షకు దిగుతానని గతంలో ఓపీఎస్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. కాగా ఓపీఎస్ హెచ్చరికను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి టీవీవీ దినకరన్ కొట్టిపడేశారు. దీక్ష ఆయన ఆరోగ్యానికి అంతమంచిది కాదంటూ ఎద్దేవా చేశారు.
కాగా, పన్నీర్ సెల్వం దీక్షకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. పలువురు మద్దతుదారులు, ప్రజలు దీక్షాస్థలి వద్దకు చేరుకుంటున్నారు. పన్నీర్‌తో పాటు జయలలిత మృతి పట్ల అనుమానం వ్యక్తం చేసిన పలువురు నేతలు, గౌతమి లాంటి నటీమణులు ఆయనతో జతకలిసే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం పన్నీర్ సెల్వం దీక్ష ప్రస్తుతం తమిళనాడులో మరో అలజడి రేపే దిశగా సాగుతోంది. మరో జల్లికట్టు ఉద్యమంలా ఓపీఎస్ దీనికి ఊపిరి పోశారని అంటున్నారు.