స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎక్కడపడితే అక్కడ మాట్లాడుకునే వారు కొందరు. నడుచుకుంటూ మాట్లాడే వాళ్లు మరికొందరు. ముందు వెనకా ఏం జరుగుతోంది. ఇంకా ఫోను ఆన్ చేసి చెవిదగ్గర పెడితే ఈ లోకాన్ని మరిచిపోయేవారు చాలామందే వున్నారు. అయితే తాజాగా రోడ్డుమీద ఫోన్ మాట్లాడుకుంటూ వెళుతున్న యువతిపై ఓ పోలీసు అధికారి వీరంగం ప్రదర్శించాడు. మహిళ అని కూడా చూడకుండా.. బెదిరించి వదిలిపెట్టకుండా ఖాకీ కావరం చూపించాడు. జుట్టుపట్టుకుని ఈడ్చి పడేశాడు.
బీహార్‌లోని నలంద ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఫోన్‌లో బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడుకుంటూ వెళ్తున్న ఆమెను.. మఫ్టీ దుస్తుల్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి కుమార్ ఆమెను చూశాడు. కోపంతో నడిరోడ్డుపై ఆమెను పట్టుకొని తీవ్రంగా కొట్టాడు. ఫోను లాక్కుని రోడ్డు మీదికి విసిరిపారేశాడు. నోటికొచ్చినట్లు క్యారెక్టర్ మంచిది కాదంటూ దూషించాడు.