మహిళలపై వావివరుసలు లేకుండా, వయోభేదం లేకుండా కామాంధులు విరుచుకుపడుతుంటే మేము ఎందుకు ఓటేయాలని అడిగారు. మనం ఏ స్వతంత్ర్యం గురించి మాట్లాడుకుంటున్నాం.. రేపిస్టులు స్వేచ్ఛగా తిరుగుతున్న లోకంలో జీవిస్తున్నామా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 70 ఏళ్ల స్వాతంత్ర్యం ఇంకా తమకు స్వేచ్ఛనివ్వలేదని మండిపడ్డారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజునే చండీఘడ్‌లో ఓ వ్యక్తి 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడటంపై దివ్యాంక తీవ్రంగా ఖండించారు. పాఠశాలలో జెండా వందనానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న బాలికపై ఇలాంటి దారుణం చోటుచేసుకోవడంపై దేశంలో మహిళల భద్రతను ఉద్దేశించి దివ్యాంక ట్విటర్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లను కనాలంటేనే భయంగా ఉందన్నారు. ప్రస్తుతం అమ్మాయిని కాపాడటంలో ''భేటీ బచావో'' కార్యక్రమం ఏమైంది? అడిగారు.
తనకు కుమారుడికి జన్మనివ్వాలని లేదు. ఇక అమ్మాయిని కనాలంటే భయంగా వుందని దివ్యాంక అన్నారు. ఒకవేళ అమ్మాయిని కంటే స్వర్గం నుంచి ఈ నరకానికి ఎందుకు తీసుకొచ్చావని అడిగితే ఏం చెప్పను అంటూ దివ్యాంక ట్వీట్ చేశారు. క్రూరమైన నేరాలు చేసే వారిని ఎందుకు క్రూరంగా శిక్షించరు?.. ఇకనైనా పార్టీలు మేల్కోవాలని వ్యాఖ్యానించారు.