ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారు. ఈ ప్రయాణంలో భాగంగా, గురువారం పవన్ తమిళనాడును సందర్శించారు. తమిళనాడు, కుంభకోణంలోని ఆది కుంభేశ్వరర్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.
ఈ పర్యటన సందర్భంగా, పవన్ కళ్యాణ్ స్థానిక విద్యార్థులు, నివాసితులతో సంభాషించారు. వారితో సెల్ఫీలు తీసుకున్నారు. విద్యార్థులు ఉత్సాహంగా, హర్షధ్వానాలు చేస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అంతకంటే ముందు కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన తన వ్యక్తిగతమన్నారు. రాజకీయాలు సంబంధం లేదన్నారు. పుణ్యక్షేత్రాల సందర్శనలో పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరా నందన్ ఉన్నారు.
• AP Deputy CM Sri Pawan Kalyan took selfie with fans at Adi Kumbeswarar Temple, Kumbakonam, Tamil Nadu.. pic.twitter.com/naRS5cGyS5